allu sirish revealed his breakup story in urvasivo rakshasivo promotion
mictv telugu

ఆ పెద్దింటి అమ్మాయితో బ్రేకప్.. అల్లు శిరీష్ సీక్రెట్ స్టోరీస్

October 19, 2022

allu sirish revealed his breakup story in urvasivo rakshasivo promotion

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఆచి తూచి సినిమాలు చేస్తుంటాడు. మంచి బిజినెస్ మైండ్ అని పేరున్న అల్లు శిరీష్ సినిమా లెక్కలు వేరేలా ఉంటాయని టాక్. తండ్రి అల్లు అరవింద్ వ్యాపారవేత్త లక్షణాలన్నీ అల్లు శిరీష్‌లో ఉంటాయని స్వయంగా మెగాస్టార్ కూడా చెప్పారు. అయితే ఇంత నాలెడ్జ్ ఉన్నా.. అల్లు శిరీష్ సైతం ప్రేమలో విఫలమయ్యాడని.. అది కూడా ఒక్కసారి కాదు పలుమార్లు బ్రేకప్స్ జరిగాయని స్వయంగా అతనే ప్రకటించాడు. తాజాగా హీరోయిన్ అను ఇమ్మానియేల్ హీరోయిన్’గా అల్లు శిరీష్ చేస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్‌తో విజేత అనే హిట్ మూవీ చేసిన రాకేష్ శశి ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. నవంబర్ 4వ విడుదల అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో అల్లు శిరీష్ తన బ్రేకప్స్‌ని బయట పెట్టాడు.

హీరోయిన్ అను ఇమ్మానియేల్‌తో ప్రేమలో ఉన్నారని అందుకే సినిమాలో రెచ్చిపోయి రొమాన్స్ చేసారంటూ వస్తున్న వార్తలపై హీరో శిరీష్ స్పందించాడు. తమ మధ్య ప్రేమ అనే బంధం లేదు, డేటింగ్‌లో ఉన్నామంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ వెల్లడించాడు. ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్స్ గురించి మరిన్ని సంచలన విషయాలు చెపాప్డు శిరీష్.మీ జీవితంలో బ్రేకప్ గురించి చెప్పాలని యాంకర్ అడిగితే తన జీవితంలో చాలా బ్రేకప్స్ ఉన్నాయని.. ముఖ్యంగా రెండు మూడు బాగా పెద్ద బ్రేకప్స్ అయ్యాయి అని చెప్పుకొచ్చారు. వారితో చాలా క్లోజ్ అయిన తర్వాత బ్రేకప్ అయిందని, ఈ సందర్భంగా అల్లు శిరీష్ పేర్కొన్నారు. అయితే ఒక పెద్దింటి అమ్మాయి మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయితో కూడా బ్రేకప్ అయిందట కదా అని అడిగితే అవునని ఆమెకు తానే బ్రేకప్ చెప్పానని ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు.