అల్లు స్టూడియోస్ ఇక్కడే.. ఎంత స్థలమో..!  - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు స్టూడియోస్ ఇక్కడే.. ఎంత స్థలమో..! 

October 2, 2020

Youth walking python Brighton east Sussex police warns  ....

తెలుగు సినీపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాక దిగ్గజ నటులు, నిర్మాతలు పక్కా ప్రణాళికతో భారీ స్టూడియోలు కట్టుకున్నారు. అప్పడు వేలల్లో ఉన్న ఎకరా ధర ఇప్పుడు కోట్లకు చేరుకుంది. నేటి హీరోలు కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్, ఆయన కొడుకులు అర్జున్, శిరీష్, బాబీలు  హైదరాబాద్ నగరంలో భారీ స్టూడియోను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గండిపేట సమీపంలో 10 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ రోజు దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. సువిశాల స్థలంలో స్టూడియోకు ఏర్పాట్లు సాగుతున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. తాతా అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ పేరుతో స్టూడియో నిర్మిస్తున్నట్లు నిన్న ప్రకటించడం విదితమే. దీనికి సంబంధించిన లాంచింగ్ వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో సినిమాలతోపాటు టీవీ ప్రోగ్రాముల షూటింగులు కూడా జరగనున్నాయి. అరవింద్ ‘గీతా ఆర్ట్స్’ పేరుతో పేరు ప్రఖ్యాతులు గడించడం తెలిసిందే.