నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ! - MicTv.in - Telugu News
mictv telugu

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా !

June 14, 2017

డిజే సినిమా రిలీజ్ కాకముందే వివాదాలను మూట గట్టుకుంది. బ్రాహ్మణ సంఘాలు ఆ సినిమా మీద విరుచుకుపడ్డాయి. ఇప్పుడా సినిమా టైటిల్ నే మార్చవల్సిందిగా వాళ్ళ నుండి డిమాండ్స్ వినబడుతున్నాయి. ఇదంతా చాలా కూల్ గా పక్కన పెడుతూ అల్లు అర్జున్ ఇంత వరకు తెర మీదకొచ్చి ఎలాంటి ఎక్స్ ప్లనేషన్ ఇవ్వలేదు. నాకు వివాదాలతో పని లేదు నా పని నేను చేసుకుపోతానన్నట్టు ముందుకు దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ’ అనే సినిమా పోస్టర్ ను పోస్ట్ చేస్తూ ఇవాళే పూజ అని పెట్టాడు. ఇంతకీ ఆ కొత్త సినిమా ఎవరి డైరెక్షన్ లో అనుకుంటున్నారూ ? ఇంకెవరూ కథా రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్లో. బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చూడాలి మరి సైలెంటుగా షూటింగ్ జరుపుకొని డీజేలా ఇది కూడా వివాదాల మయమౌతుండొచ్చునేమో ! ?