బాదం పప్పుతో ఆరోగ్యం... - MicTv.in - Telugu News
mictv telugu

బాదం పప్పుతో ఆరోగ్యం…

July 28, 2017

బాదం పప్పు రోజు తినడం వలన ,శరీరానికి పాలీఅన్ శాచురేటెడ్,అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ బి6,బి12 ,మెగ్నిషియం,
పొటాషియం వంటి పోషకాలు శరీరానికి అందుతాయి .దీంతో చక్కని పోషణ అందడమే కాదు అనారోగ్య సమస్యలు రావు .రోజు గుప్పెడు
నానబెట్టిన బాదం పప్పు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

1.బాదం పప్పులో విటమిన్ ఇ ఉండడం వల్ల రోజూ తినడం వలన శిరోజాలు దృడంగా ,ఒత్తుగా పెరుగుతాయి,చుండ్రు పోతుంది.

2.బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. తద్వార రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్లు దరి చేరవు. క్యాన్సర్ కూడా రాదు.

3.రోజు నానబెట్టిన బాదం తినడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ వస్తుంది. గుండె సమస్యలు తగ్గి,అధిక బరువు
తగ్గుతారు.

4. బాదం పప్పులో ఉండే విటమిన్ ఇ మెదడుకు మంచిది, ఎదిగే పిల్లలో తెలివి పెరుగుతుంది.
5. జీర్ణాశయం ,పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా పోయి, మంచి బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది.
6. బాదంలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాల వల్ల చర్మం కాంతిగా యవ్వనంగా తయారువుతుంది.