ఏపీలో ఈనెల 4నుంచి ఒంటిపూట బడులు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఈనెల 4నుంచి ఒంటిపూట బడులు

April 1, 2022

9

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. వేసవి తీవ్రత ఆధారంగానే తాము విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్టు శుక్రవారం సురేశ్ చెప్పారు. అయితే, బడి వేళలు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆయన కోరారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రం మార్చి 16వ తేదీనుంచి ఒంటిపూట బడులను పెట్టింది. ఒంటిపూట బడులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పని గంటలుగా నిర్ణయించింది. అంతేకాకుండా తాజాగా ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్నీ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఏప్రిల్ 4నుంచి ఒంటిపూట బడులను పెడుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.