తెలంగాణలో ఈనెల 16నుంచి ఒంటిపూట బడులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఈనెల 16నుంచి ఒంటిపూట బడులు

March 12, 2022

ngnf

తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఆదేశాలను త్వరలోనే పాఠశాల యాజామన్యాలకు జారీ చేయనుంది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. దీంతో పిల్లల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఈనెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పని గంటలుగా నిర్ణయించింది. ఇక, మే 20వ తేదీన 10వ తరగతులు ముగియనున్నాయి. అదే రోజు స్కూళ్లకు చివరి పని దినం కానుంది. ఇక, జూన్ 12వ తేదీ నుండి కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కానుంది. అప్పటి వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు.

మరోపక్క వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 1 నుంచి 8 తరగతుల్లోని విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో వెల్లడించారు. 2023-24 విద్యా సంవత్సరంలో 9వ తరగతి, 2024-25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం విద్యాబోధనను ప్రారంభింబిస్తామని ఆమె పేర్కొన్నారు.