Alot: Father of two elopes with paramour, wife files complaint
mictv telugu

లేచిపోయిన నా భర్తను పట్టుకొస్తే మాంచి బహుమతిస్తా.. పోస్ట్ వైరల్

September 15, 2022

ఓ గ్రామంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వివాహిత.. తన భర్త కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చేసింది. ఇప్పుడు అది వైరల్ గా మారి ఆ ప్రాంతంలోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. పెళ్లై , ఇద్దరు పిల్లలున్న భర్త మరో అమ్మాయితో లేచిపోయాడని, వెళ్తూ, వెళ్తూ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా తీసుకెళ్లాడని , అతని ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇస్తామనేది ఆ పోస్ట్ సారాంశం.

మధ్యప్రదేశ్‌లోని అలోట్ ప్రాంతానికి చెందిన స్వప్నకు పదేళ్ల క్రితం(2012 లో) విక్రమ్ నవైత్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. స్వప్న అవాలియా సోలంకి అనే గ్రామంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తుండగా.. విక్రమ్ మాత్రం నిరుద్యోగి. ఈ క్రమంలోనే విక్రమ్ గత నెల 17 నుంచి కనబడకుండా పోయాడు. దీంతో స్వప్న సోషల్ మీడియాలో భర్త గురించి పోస్ట్ పెట్టింది. ‘ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు విక్రమ్. ఈయన నా భర్త. ఆగస్టు 17 నుంచి కనిపించడం లేదు. అతడికి మరో యువతితో సంబంధం ఉంది. ఆమెతో కలిసి అతడు పారిపోయాడు. మాయమాటలు చెప్పి యువతులను మోసం చేస్తూ ఉంటాడు. ఇంట్లోంచి పారిపోతూ రూ.2లక్షల నగదు, ఆభరణాలు, కారు కూడా ఎత్తుకెళ్లాడు. ఇతడి ఆచూకీ ఎవరైనా చెబితే తగిన బహుమతి ఇస్తా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్తతోపాటు తన ప్రేయసిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు అతడి జాడ దొరకలేదన్నారు.