'ఎఫ్ 4' కూడా ఉంది: అనిల్ రావిపూడి - MicTv.in - Telugu News
mictv telugu

‘ఎఫ్ 4’ కూడా ఉంది: అనిల్ రావిపూడి

May 17, 2022

‘ఎఫ్ 2’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే షోలో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’తోపాటు ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. కచ్చితంగా ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని ఆయన క్లారిటి ఇచ్చారు.

ఈ టీవీలో వారం వారం ప్రసారమయ్యే ఆలీతో సరదగా షో ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. ఆ ప్రోమోలో నటుడు సునీల్‌తోపాటు, అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ‘ఒంగోల్‌లో డాడీ కాకుండా హైదరాబాద్‌లో డాడీ ఎలా ఉన్నాడు’ అని ఆలీ అడిగారు. అనంతరం అనిల్ నవ్వుతూ ‘హైదరాబాద్ చాలా బ్రహ్మాండంగా ఉంది’ అని అన్నారు. ఆ తర్వాత ఆలీ.. ‘ఎఫ్ 2, ఎఫ్ 3తోపాటు ఎఫ్ 4′ కూడా ఉంటుందా?’ అని అడిగారు. దానికి అనిల్ రావిపూడి.. ‘నవ్వించటమే మన పని కదా కచ్చితంగా ఉంటుంది” అని ఆయన అన్నారు.

ఇక, ‘ఎఫ్3’ సినిమా విషయానికొస్తే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోలుగా వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించగా, హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ నటించారు. ప్రధాన పాత్రల్లో బొమన్ ఇరానీ, సునీల్ నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ‘ఎఫ్ 3’ సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్ సామాజిక మాధ్యమాలలో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి.