ఒకపాట హిట్ అవ్వాంటే బోలెడు కాంబినేషన్స్ సెట్ అవ్వాలి, ఏది లేకపోయినా పాట సక్సెస్ అవ్వదు. లిరిక్ బావుండాలి, ట్యూన్ క్యాచీగా ఉండాలి. పాట చిత్రీకరణ, డాన్స్, యాక్టర్స్ ఇలా అన్నీ పాటకు తగ్గట్టు ఉండాలి. అప్పుడే అది బంపర్ హిట్ అవుతుంది. అలా అన్ని కుదిరాయి కనుకనే నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.
దీనికి సంబంధించన క్రేజ్ ఇప్పటప్పట్లో తగ్గేట్టు లేదు. దానికి తోడు రోజుకు ఒకరు దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా నాటు నాటు పాట పాడిన సింగర్, కీరవాణి కొడుకు కాలభైరవ ట్విట్టర్ పోస్ట్ వైరల్ అయింది. వైరల్ అనడం కంటే కొంతమందికి కోపం తెప్పించింది అనడం సబబేమో. నాటునాటు పాటకు ఆస్కార్ రావడం, ఆ పాటను లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం తనకెంతో ఆనందం కలిగించిందని, దానికి రాజమైళి, నాన్న, కొరియోగ్రాఫర్ ప్రమే రక్షిత్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ అందరూ ముఖ్యకారణం అంటూ కాలభైరవ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. వాళ్ళు లేకుంటే ఈ అందమైన అనుభూతి పొందడం అవకాశం నాకు దక్కేది కాదన్నాడు. ఆర్ఆర్ఆర్ లో పాలుపంచుకునే ఛాన్స్ వచ్చినందుకు అదృష్టవంతుడిని అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ పోస్ట్ తారక్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. అందరి గురించి చెప్పీ తమ హీరోల గురించి చెప్పకపోవడం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అసలు వాళ్ళిద్దరూ లేకపోతే పాట అంత హిట్టయ్యేది కాదని, ఆస్కార్ వరకూ వెళ్ళేది కాదని మండిపడ్డారు.
ఫ్యాన్స్ ఇలా మండిపడడంతో కాలభైరవ మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. తాను కేవలం అస్కార్ ఫంక్షన్లో వేదిక మీద లైవ్ ఫెర్మామెన్స్ గురించి మాత్రమే రాసానని, దానికి సంబంధించన వాళ్ళకే థాంక్స్ చెప్పానని వివరణ ఇచ్చాడు. తారక్, చరణ్ అన్నల వల్లే నాటు నాటు పాట సక్సెస్ అయిందన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదని అన్నాడు. తాను చేసిన ట్వీట్ తప్పుగా వెళ్ళిందని, అందుకు తనను క్షమించాలని రీ ట్వీట్ చేశాడు.