అమలాపాల్ సరిగ్గానే చెల్లించింది - MicTv.in - Telugu News
mictv telugu

అమలాపాల్ సరిగ్గానే చెల్లించింది

November 2, 2017

ఖరీదైన కారు కొని రూ. 20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి అమలాపాల్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమె తప్పుడు అడ్రస్ తో కాకుండా సరైన  అడ్రస్తోనే కారును కొందని తేల్చింది. కారు రిజిస్ట్రేషన్ వ్యహారంలో అవకతవకలు జరగలేదని రవాణా మంత్రి స్పష్టం చేశారు. అమలాపాల్ రూ. 1.10 కోట్ల విలువైన బెన్స్-ఎస్ క్లాస్ కారును ఇటీవల కొన్నది. దీన్ని సొంతమైన రాష్ట్రమైన తమిళనాడులో కాకుండా  పుదుచ్చేరిలో కొనుగోలు చేసింది. పన్ను పోటు తగ్గించుకోడానికి ఈ పనిచేసిందన ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కష్టపడి సంపాదించిన సొమ్ముతో కారును కొనుక్కుంటే ఇలాంటి నిందలు వేస్తారా అని వాపోయింది.