Amala Paul’s friend arrested after she files a complaint
mictv telugu

అమలాపాల్‌పై లైంగిక వేధింపులు.. భవీందర్ అరెస్ట్

August 30, 2022

తనను కొందరు లైంగికంగా వేధిస్తున్నారని దక్షిణాది నటి అమలాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మాజీ ప్రియుడు భవీందర్‌ సింగ్‌ దత్‌తోపాటు 11 మందిపై ఆరోపణలు చేస్తూ తమిళనాడులోని విల్లుపురం పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కారు. ప్రేమలో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెట్టి కెరీర్ నాశనం చేస్తానని భవీందర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె వివరించారు.

అమలాపాల్ తెలిపిన వివరాలు ప్రకారం.. 2018లో ఆమె,భవీందర్‌ సింగ్‌ ఓ సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తర్వాత ప్రేమలో పడిపోయి పెళ్లి దాకా వెళ్లారు. సంస్థ ఆర్థిక విషయాల్లో గొడవలు రావడంతో విడిపోయాక, తన డబ్బు తనకివ్వాలని అతణ్ని కోరారు. భవీందర్ డబ్బులివ్వకుండా సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదరిస్తున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు భవీందర్‌ను అదుపులోకి తీసుకుని మిగతావారి కోసం గాలిస్తున్నారు. కాగా, భవీందర్ సింగ్, అమలాపాల్ పెళ్లి చేసుకున్నట్టు అప్పట్లో కొన్ని ఫోటోలు విడుదలయ్యాయి. అయితే అవి నకిలీవని ఆమె కొట్టిపారేశారు.