వాళ్ళకి అమరావతి డిజైన్ నచ్చలేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

వాళ్ళకి అమరావతి డిజైన్ నచ్చలేదు..

July 26, 2017

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి ప్లానింగును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసారు. బ్రిటీష్ ఆర్కిటెక్టులు రూపొందించిన ఈ డిజైన్ మీద అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. తొలుత క్యాన్సిల్ అయిన డిజైన్ విద్యుత్ టవర్స్ లా వుండింది, ఇదేమో డైమండ్ ఆకారంలో కార్పోరేట్ లెవల్లో వుంది తప్ప ఎక్కడా తెలుగుదనం కనిపించడం లేదంటూ బిజెపి రాష్ట్ర అభివృద్ధి కన్వీనర్ శ్రీనివాసరాజు కొత్తగా వచ్చిన డిజైన్ మీద తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం విషయంలో చాలా ఆలస్యం చేస్తుండటంతో ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఫైనల్ డిఆర్పి ప్లాన్ ను తొందరగా కేంద్రానికి అప్పజెప్తే అక్కడి నుండి నిధులు కూడా తొందరగానే వస్తాయి కదా అంటున్నారు.

ఇలాంటి ప్లాన్ ను విదేశీయులే చేయాల్సిన అవసరం ఏముంది ? మన దగ్గర కూడా మంచి మంచి ఆర్కిటెక్టులు వున్నారు కదా ? పైగా ఆ ప్లాన్ లో కార్పోరేటిజమే కన్పిస్తోంది తప్ప తెలుగుజాతి గర్వపడేలా ఎక్కడా అలాంటి ఆనవాలు కనిపంచడం లేదు. అసెంబ్లీ, రాజ్ భవన్, సెక్రెటేరియట్ వంటివి తెలుగుతనం ఉట్టిపడేలా, తెలగు జాతి గర్వించేదిగా వుండేలా చంద్రబాబు శ్రధ్ధ తీస్కుంటే బాగుంటుందంటున్నారు. కార్పోరేట్ ఆఫీసులు, ఐటీ కంపెనీల నిర్మాణాల్లా వుంది డిజైన్ తప్పితే ఎక్కడా తెలుగు కల్చర్, నాగరికత కనిపించడం లేదు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలుగు వారసత్వాన్ని ఇన్ క్లూడ్ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసారు. అలాగే విజయవాడలోని పిడిపి గ్రౌండ్ లో చైనా కంపెనీకి ఒక బిజినెస్ మాల్ ను కట్టేందుకు పర్మిషన్ ఇవ్వడం మంచిది కాదని అంటున్నారు. అనవసరంగా ఈ ప్లాన్ ను ఎవరికో విదేశీయులకు అప్పజెప్పే కన్నా డైరెక్టర్ రాజమౌళికి అప్పజేప్తే జబర్దస్త్ ప్లాన్ వేసిస్తాడు కదా అని శ్రీనివాస రాజు తన అభిప్రాయాన్ని చెప్పారు. నిజమే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి రాజమౌళిని కన్ సల్ట్ అయితే బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యంలోని రాజభవనల్లాంటి కళ్లు చెదిరిపోయే చారిత్రకమైన డిజైన్స్ వేసి ఇస్తుండొచ్చు.

https://youtu.be/ceGREMmqZjI