జగన్ ప్రభుత్వానికి షాక్..రాజధానిపై హైకోర్టులో పిల్ - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ ప్రభుత్వానికి షాక్..రాజధానిపై హైకోర్టులో పిల్

January 22, 2020

yhgr

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీఆర్డీఏ చట్టాన్ని సోమవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ప్రస్తుతం శాసనమండలిలో ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఆర్డీఏ చట్టం రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలయ్యింది. ఏపీ అసెంబ్లీ ఆమోదించి సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లును సస్పెండ్ చేయాలని.. విజయవాడకు చెందిన వ్యాపారి శీలం మురళీధర్‌రెడ్డి పిల్‌లో కోరారు. 

ఏపీ సీఆర్డీఏ చట్టం రద్దు అమలును నిలిపివేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతే.. భూములిచ్చిన రైతులు, పేదల హక్కులు హరించినట్లు అవుతుందని పిల్‌లో మురళీధర్‌రెడ్డి ప్రస్తావించారు. అమరావతి ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు జరిగాయని.. భారీగా నిధులు ఖర్చు చేశారని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ అంశాన్ని ప్రస్తావించారు.