Amaravati farmers padayathra in Rajahmundry
mictv telugu

అమరావతి రైతులపై వైసీపీ ఎంపీ దాడి.. రాజమండ్రిలో ఘటన

October 18, 2022

Amaravati farmers padayathra in Rajahmundry

అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ హైకోర్టు అనుమతితో ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర రాజమండ్రికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్రగా వెళ్తున్న రైతులపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి.

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు చెప్పులు, బాటిళ్లు విసురుతూ నిరసనకు దిగారు. ఓ సందర్భంలో ఎంపీయే స్వయంగా రైతులపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఆజాద్ చౌక్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. ఈ ఘటనపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించారు. హైకోర్టు అనుమతితో జరుగుతున్న పాదయాత్రకు భద్రత కల్పించలేని అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు అనే విషయాన్ని మరచి దాడులకు పాల్పడ్డవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.