అమరావతి స్తూపం.. 2 వేల ఏళ్ల కిందట.. వావ్.. - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతి స్తూపం.. 2 వేల ఏళ్ల కిందట.. వావ్..

March 27, 2018

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నగరం, బుద్ధబోధనల పీఠం అమరావతి. వేల ఏళ్ల చరిత్ర గల అక్కడి బౌద్ధస్తూపం విశిష్టత ఎంత చెప్పినా తక్కువే. ఆ అపురూప స్తూపం కాలగర్భంలో కలిసిపోయినా దాని ఆనవాళ్లు పదిలంగానే ఉన్నాయి. బ్రిటిష్ మ్యూజియంలో ఎన్నో అద్భుత శిల్పాలు కనువిందు చేస్తున్నాయి. అయితే ఇవన్నీ ఆ మహానిర్మాణం ఎలా ఉండేదే ఊహించుకోవడానికి అంతగా వీలు కల్పించవు.

బ్రిటిష్ మ్యూజియం ఈ కొరత తీర్చింది. త్రీడీ వర్చువల్ టూర్ వీడియోను రూపొందించింది. రెండువేల 200 ఏళ్ల కిందట.. స్తూపం ఎంత కళాసౌందర్యంతో ఉట్టుపడుతూ ఉండేదే కళ్లకు కట్టినట్లు చూపింది. విహంగ వీక్షణం, ప్రధాన ద్వారం, ప్రకారం వంటి వివరాలను ఇందులో ప్రదర్శించింది. పరిశోధకులు ఇప్పటి వరకు దొరికిన అమరావతి శిల్పాలు, ఇతర చారిత్రకాధారాలతో దీన్ని రూపొందించారు. అమరావతి స్తూప ప్రాభవం 14వ శతాబ్దం నుంచి తగ్గుతూ వచ్చింది. శిల్పాలను, స్తంభాలను ధ్వంసం చేసి ఇళ్లు కట్టుకున్నారు. సున్నం కోసం కాల్చారు. మిగిన శిల్పాలను బ్రిటిషర్లు లండన్ కు తరలించారు. కొన్ని మద్రాస్ మ్యూజియంలో ఉన్నాయి.