Amarinder Singh joins BJP
mictv telugu

బీజేపీలోకి అమరీందర్ సింగ్.. రెండో సారి సొంత పార్టీ విలీనం

September 19, 2022

Amarinder Singh joins BJP

పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు. తన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, కిరణ్ రిజిజులు పాల్గొన్నారు. ఈ ఉదయం అమరీందర్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.

కాగా, గతేడాది సీఎంగా అమరీందర్ సింగ్‌ని కాంగ్రెస్ పార్టీ తప్పించింది. దాంతో మనస్తాపానికి గురైన అమరీందర్ సొంతంగా పార్టీ పెట్టి బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. అయితే ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. దీంతో బీజేపీలో చేరారు. అయితే పార్టీని విలీనం చేయడం ఆయనకు ఇది రెండో సారి. 1992లో అకాలీదళ్ నుంచి బయటికొచ్చిన తర్వాత శిరోమణి అకాళీదళ్ (పాంథిక్) పేరుతో పార్టీని పెట్టారు. తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇప్పుడు రెండో సారి పార్టీని విలీనం చేశారు. పంజాబ్‌లో బలపడాలన్న బీజేపీ లక్ష్యానికి 80 ఏళ్ల అమరీందర్ సింగ్ ఎంతవరకు తోడ్పాటు అందిస్తారో చూడాల్సి ఉంది.