జమ్మూకాశ్మీర్ అమర్నాథ్ను భారీ వర్షం ముంచెత్తింది. యాత్రికులపై ప్రకృతి బీభత్సం సృష్టించింది. కొండలపైనుంచి వస్తున్న వరదలో వేలాది మంది యాత్రికులు చిక్కుకున్నారు. దాదాపు 12 వేల మంది యాత్రికులు గుడారాల్లో తలదాచుకున్నారు. భారీగా వచ్చిన వరదకు గుడారాలు, యాత్రికులు కొట్టుకపోయారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా..పలువురు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కుంభవృష్టి సమయంలో అక్కడే దాదాపు 12 వేల మంది ఉన్నారు. సాయంత్రం 5.30 నుంచి బీభత్సంగా వర్షం కురుస్తోంది. మేఘం బద్దలైనట్లుగా వర్షం కురుస్తోంది. గుడారాల్లోకి వరద ఒక్కసారిగా రావడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. కొండచరియలు సైతం విరిగిపడుతుండటంతో అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు అధికారులు.