స్టీరింగే ఏకే 47..సలీమ్ కు దేశంసెల్యూట్..! - MicTv.in - Telugu News
mictv telugu

స్టీరింగే ఏకే 47..సలీమ్ కు దేశంసెల్యూట్..!

July 11, 2017

ఎలాగైనా ఉగ్రమూకల నుంచి తప్పించుకోవాలన్న అతని తెగింపు.. అమర్ నాథ్ యాత్రికుల ప్రాణాల్ని కాపాడింది. స్టీరింగ్ నే ఏకే 47 లా భావించి..వారిపై పోరాడాడు..ఉగ్రవాదులు తూటాలు గురిపెడితే…తన కాళ్ల కింద ఎక్స్ లేటర్ నే గ్రనేడ్ గా భావించాడు. ఏకే 47తో వీరోచితంగా పోరాడుతూ…మారణకాండను ఆపే ప్రయత్నం చేశాడు. ప్రతి చర్యతో ఉగ్రవాదల టార్గెట్ ను దెబ్బకొట్టాడు. చివరకు వారిపై బస్సుతో పోరాడి గెలిచాడు. భారత దేశంలో హిందూ ముస్లిం భాయ్..భాయ్ అని చాటాడు.అఖండ భారతాన్ని మతం పేరిట ఎప్పటికీ వీచ్చిన్నం చేయలేరని స్టీరింగ్ తో సమాధానమిచ్చాడు. ..నిజంగా నువ్వే గ్రేట్ సలీమ్ …దేశం మొత్తం నీకు సెల్యూట్ చేస్తుంది.

చిమ్మచీకటి..బస్సుపైకి దూసుకొస్తున్న బుల్లెట్లు.అయినా డ్రైవర్ సలీమ్ అదర లేదు.బెదర లేదు..అరకిలోమీటరు బస్సును తీసుకెళ్లాడు. యాభై మందిని సురక్షిత ప్రాంతానికి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఏడుగురి ప్రాణాలు కాపాడలేక పోవచ్చు..కానీ మిగతా అందరినీ సేవ్ చేశాడు. అమర్ నాథ్ యాత్రలో ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఉగ్రవాదుల బుల్లెట్లు తప్పించుకుంటూ సాహసం చేశాడు.

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు యాత్రికులు మృతిచెందగా.. 11 మంది గాయాలయ్యాయి. అమర లింగేశ్వరుడిని దర్శించుకుని తిరిగి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా.. దాడి జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు. డ్రైవర్ సలీమ్ వల్లే తాము బయటపడ్డామని అంటున్నారు.

వీరిని కాపాడింది ఒక ముస్లిం అని తెలిస్తే ఉగ్రవాదుల దడుసుకుంటారు.ఉగ్రవాదులు అందరు ముస్లింలు కావొచ్చు గానీ…అందరూ ముస్లింలు వారికి మద్దుతు ఇవ్వరని తెలిసొచ్చేలా చేశాడు.