రాత్రిపూట వింతజీవి.. వీడియో వైరల్..  - MicTv.in - Telugu News
mictv telugu

రాత్రిపూట వింతజీవి.. వీడియో వైరల్.. 

September 28, 2020

‘Amazed and creeped out’: Man spots robot dog roaming around Canadian street. Watch

రాత్రిపూట ఫుట్‌పాత్ మీద ఓ వింతజీవి వీధుల్లో తిరుగుతోందని ప్రజలు కాస్త ఆందోళన చెందారు. అయితే అది వింతజీవి ఏం కాదు.. రోబో కుక్క అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రోబో కుక్కు పేరు స్పాట్. వీటిని బోస్టన్ డైనమిక్స్ అనే రోబోటిక్స్ సంస్థ రూపొందించింది. కెనడాలోని అంటారియోలో ఒక వీధిలో తిరుగుతున్న ఈ రోబో డాగ్‌ను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ రోబో డాగ్ గొర్రెల కాపరిగా పనిచేయడంతో పాటు, సామాజిక దూరం పాటించేలా ప్రజలను ఇవి అప్రమత్తం చేస్తాయి. నాథన్ కనసావే అనే వ్యక్తి దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 

ఈ రోబో డాగ్‌ను ఆపరేట్ చేస్తున్న వ్యక్తి అనుమతి తీసుకుని కనసావే వీడియో రికార్డ్ చేశాడు. ఈ విషయమై కనసావే మాట్లాడుతూ.. ‘మేము రోడ్డుపై వెళ్తున్నాం. ముందు రోబోను చూసినప్పుడు, అది ఏదో కొత్తరకం జంతువు అనుకున్నాం. అది అచ్చం కుక్క మాదిరే నడవసాగింది. దాని వెనుక ఉన్న ఆపరేటర్‌ను చూశాం’ అని ఓ మీడియాకు తెలిపాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది. చాలా మంది రీట్వీట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.