amazing Health Benefits Of Barley Water
mictv telugu

ఈ నీళ్ళు ఓ గ్లాసెడు తాగితే చాలు…మీ ఆరోగ్యం మీ వెంటే.

January 31, 2023

health benefits of barley water

పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికానికి బార్లీ నీళ్ళు లేదా సగ్గుజావ తాగించేవాళ్ళు ఇంట్లోవాళ్ళు. అయితే, కేవలం జ్వరం ఉన్నప్పుడే కాదు, బార్లీ ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది. బార్లీ వలన బరువు కూడా తగ్గొచ్చు అని చెబుతున్నారు డైటీషియన్లు. వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్ళు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది.

పిల్లలకు బార్లీ నీళ్ళు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

మలబద్దకం ఉంటే బార్లీ చాలా బాగా పని చేస్తుంది. అసలు మామూలుగా ఈ నీళ్ళు రోజూ తాగితే అసలు ఈ ప్రాబ్లెమే రాదు.ఎండప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్ళు తాగాలి.

డయాబెటీస్ ఉన్నవారికి బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్‌ కూడా అదుపులోనే ఉంటుంది.ఇక గర్భిణులు రోజూ బార్లీనీళ్ళు తాగితే మరీ మంచిది. కాళ్ళ వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్ళు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్ళు బాగా ఉపయోగపడతాయి.

రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్‌.ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్ళు తాగితే మంచి ఫలితం ఉంటుంది.మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. చిన్న చిన్న రాళ్ళు ఉంటే అవి కూడా కరిగిపోతాయి. కాబట్టి రోజూ బార్లీ నీళ్ళు తాగండి. ఎలాంటి రోజైనా, సీజన్ అయినా కూడా.