అమెజాన్ ఆఫర్.. భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలిస్తాం.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ ఆఫర్.. భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలిస్తాం..

January 17, 2020

Amazon

ప్రపంచ ప్రఖ్యాత ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో భారత దేశంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ హామీ ఇచ్చారు. అమెజాన్ పెట్టుబళ్ల వల్ల మనదేశానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యనించిన నేపథ్యంలో అమెజాన్ ఉద్యోగాల గురించి స్పందించింది. “2025 నాటికి 10 బిలియన్ డాలర్ల భారతీయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్‌లో అమెజాన్ పెట్టుబడులు 2025 నాటికి మరో 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయి..’ అని అమెజాన్ అధినేత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆరేళ్లలో అమెజాన్ పెట్టుబడుల ఫలితంగా భారత దేశంలో 7 లక్షల మందికి ఉపాధి లభించిందని, వచ్చే ఐదేళ్లలో కల్పించే ఉద్యోగాలు దీనికి అదనమని వివరించారు

భారత్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్తలో సూక్ష్మ, చిన్న వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని ఇప్పటికే హామీ ఇచ్చిన ఆయన భారత్‌లో అమెజాన్ విస్తరణ లక్ష్యంగా పథకాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.  ఐటీ, నైపుణ్యాభివృద్ధి, కంటెంట్‌ క్రియేషన్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయని బెజోస్ అంటున్నారు. భారీ డిస్కౌంట్లు ఇస్తున్న ఈకామర్స్ కంపెనీల వల్ల మనదేశ రిటైలర్లు నష్టపోతున్న సంగతి తెలిసిందే.