హైదరాబాద్ లో అమెజాన్ భారీ సెంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ లో అమెజాన్ భారీ సెంటర్

September 7, 2017

ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌ మన దేశంలో తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో తన సేవలను మరింత విస్తరించింది.  శంషాబాద్ లో అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను గురువారం ప్రారంభించింది. 13 లక్షల  చదరపు అడుగుల స్థలంలో, 1.6 కిలోమీటర్ల కన్వేయర్‌ బెల్ట్‌లో దీన్ని ఏర్పాటుచేసింది. అమెజాన్‌ లాంచ్‌ చేసిన ఈ సెంటర్‌పై రాష్ట్ర ఐటీ శాఖ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదెంతో హర్షించదగ్గ విషయమన్నారు., నగరంలో దీన్ని ఏర్పాటుచేసినందుకు అమెజాన్ కు అభినందనలు తెలిపారు.

తెలంగాణలో ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఏర్పాటుచేయడంతో, వేలమంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విక్రయించుకునే వీలవుతుంది. ప్యాకేజింగ్‌, రవాణా, లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటి వంటి సహాయక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. అలాగే ఈ సెంటర్‌ ద్వారా అమెజాన్‌ తన స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 3.2 మిలియన్‌

ఘనపు అడుగులకు(క్యూబిక్ ఫీట్) పెంచుకుంది. దీంతో వినియోగదారులకు సరుకులను తొందరగా అందజేయనుంది. యువతకు వేలకొద్దీ ఉద్యోగవకాశాలను కూడా ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ సృష్టించనుందని అమెజాన్‌ ఇండియా, కస్టమర్‌ ఫుల్‌ఫిల్మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా తెలిపారు.