Amazon boss Jeff Bezos to give away most of $124 billion wealth to charity
mictv telugu

ఖరీదైన వస్తువు కొనొద్దు.. ప్రజలకు అమెజాన్ చీఫ్ వినతి

November 15, 2022

Amazon boss Jeff Bezos to give away most of $124 billion wealth to charity

అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ అధినే జెఫ్ బెజోస్ దానధర్మాల్లోనూ ముందుంటాడు. అయితే వ్యాపారం కోసం కఠిన నిర్ణయాలూ తీసుకుంటూ ఉంటాడు. అమెజాన్ నుంచి త్వరలో పదివేల మంది ఉద్యోగులను తొలగంచబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని సంచలన విషయాలు కూడా వెల్లడించారు. తను ఆస్తిలో అత్యధిక భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని చెప్పారు.

అయితే ఆ మొత్తాన్ని ఎలా ఇవ్వాలి, ఎలా ఖర్చు చెయ్యాలన్నదే తెలియడం లేదన్నారు. ‘‘పర్యావరణ సంరక్షణ, హక్కుల కోసం పోరాడే వారికి, ఇతర సామాజిక సేవ కోసం విరాళం ఇస్తాను. ఎలా ఇవ్వాలన్నదే నా ముందున్న సవాల్’’ అని ఆయన చెప్పారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదనని బెజోస్ హెచ్చరించారు. ప్రజలు ఖరీదైన వస్తువు కొనొద్దని, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలి కోరారు. ‘‘దేశాల ఆర్థిక వ్యవస్థలు బాగాలేవు. ఆదాయం లేకపోవడంతో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వచ్చే రోజుల్లో మరింత సంక్షోభం నెలకొంటుంది. జనం జాగ్రత్తగా ఖర్చు చేయాలి. పొదుపు చేస్తూ నగదు నిల్వ చేసుకోవాలి. ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, కార్లు, టీవీలు కొనొద్దు.’’ అని అన్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బెజోస్ సంపద 10 లక్షల కోట్ల రూపాయలకు కుపైనే. అందులో సింహభాగం దాతృత్వ కార్యక్రమాలకు ఇస్తానని చెప్పడంతో ప్రశంసలు వస్తున్నాయి.