సంక్రాంతి సంబరాల్లో ప్రపంచ కుబేరుడు - MicTv.in - Telugu News
mictv telugu

సంక్రాంతి సంబరాల్లో ప్రపంచ కుబేరుడు

January 16, 2020

Amazon CEO.

అమెజాన్ సంస్థతో అందరికి సుపరిచితుడైనా వ్యక్తి జెఫ్ బెజోస్. పంచ కుభేరుల్లో ఒకరైన ఆయన ఈసారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో చిన్నారులతో కలిసి పతంగులు ఎగరవేసి సంతోషంగా గడిపారు. వీధిలో ఉన్న పిల్లలతో కలిసి జెఫ్ బెజోస్ పాల్గొనడం అందరిని ఆకట్టుకుంది. పిల్లలతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. 

మూడు రోజులపాటు అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భారత పర్యటనకు వచ్చాడు. ఈ సందర్భంగాపిల్లలతో కలిసి పతంగులు ఎగరవేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి తెల్ల కుర్తాలో వేడుకల్లో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత తనకు బాల్యం గుర్తుకు వచ్చిందని ఆయన చెప్పారు. తన చిన్నప్పుడు ఇలా గాలిపటాలు ఎగరవేశానని పేర్కొన్నారు.