ఆర్థిక మాంద్యానికి తోడు పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ట్విట్టర్ ప్రారంభించిన ఈ ప్రక్రియను మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌తో పలు ప్రముఖ కంపెనీలు కొనసాగించాయి. ఆయా సంస్థలు తమ ఉద్యోగులపై వేటు వేసిన విషయాన్ని ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా మరోసారి అమెజాన్ బాంబ్ పేల్చింది.
ఆర్థికమాంధ్యం భయంతో గతేడాది 10 వేల ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు ప్రకటించిన అమెజాన్..తాజాగా ఆ సంఖ్యను భారీగా పెంచేసింది. మొత్తం 18 వేల మందిపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఉద్యోగం కోల్పుతున్నట్టు కొందరికీ మెసేజ్‌లు, మెయిల్స్ వెళ్లాయి. ఈ ఊహించని పరిణామంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. ఆర్థిక అస్థిరతను కారణంగానే ఈ నిర్ణయం తీసకున్నట్టు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ తెలిపారు. “ఈ నిర్ణయం బాధ కలిగించేదే అయినా తప్పలేదు. ఉద్యోగాలు కోల్పోయే వారికి అండగా ఉంటాం. సెపరేషన్ పేమెంట్, ట్రాన్సిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వంటి ప్యాకేజీలు సహా బయట ఉద్యోగం చూసుకునేందుకు సహాయపడతాం” అని జెస్సీ తెలిపారు. USలో అతి పెద్ద కంపెనీలలో ఒక్కటైన ఆమెజాన్లో మొత్తం 1.5 మిలియన్లకంటే ఎక్కువ మంది ఎంప్లాయిస్ ఉన్నారు.