అమెజాన్ కంపెనీలో జరిగిన భారీ కుంభకోణంలో హైదరాబాద్ వాసి సహా ఆరుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. వ్యాపారులకు 10 కోట్ల డాలర్ల( రూ. 736 కోట్లు) అనుచిత లబ్ది చేకూర్చిన కేసులో అమెరికా కోర్టు వీరిపై కేసులు నమోదు చేయించింది. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన భారతీయ అమెరికన్ నిషాద్ కుంజు, తెలుగు యువకుడైన రోహిత్ కమిడిశెట్టి, ఎఫ్రయిమ్ రోజెంబర్గ్, జోసప్ నీల్సన్, క్రిస్టెన్ లెసీ, హదీస్ నానోవివ్ ఉన్నారు.
కొంతమంది వ్యాపారుల సరుకులు అమ్ముకోడానికి వీలుగా వీరు అమెజాన్ కంపెనీ ఉగ్యోగులకుక, కాంట్రాక్టర్లకు లంచాలు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచనం కుంట్ర, సైబర్ నిబంధనల ఉల్లంఘన తదితర నేరాల కింద సియాటెల్‌లోని జిల్లా కోర్టు వీరిపై అభియోగాలు మోపింది. వీరిపై వచ్చే నెల 15 నుంచి విచారన మొదలవుతుంది. ‘ఆన్లైన్ వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లో అవినీతిని, అనుచిత పోటీని నివారించాల్సిన అవసరముంది. లేకపోతే కస్టమర్లు నష్టపోతారు. వారికి నాణ్యత లేని వస్తువులు అంటగట్టే అవకాశముంది..’ అని ఎఫ్‌బీఐ ఏజెంట్ రేమాండ్స్ దూడా, అటార్నీ జనరల్ బ్రియాన్ మోరాన్ ఆందోళన వ్యక్తం చేశారు.