డెలివరీ బాయ్స్  కోసం ఫ్రీగా (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

డెలివరీ బాయ్స్  కోసం ఫ్రీగా (వీడియో)

December 9, 2019

Amazon delivery01

ఇవి సోషల్ మీడియా రోజులు. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైరల్ అవుతుందో తెలియడంలేదు. తాజాగా నెటిజన్లు అందరు కలిసి ఓ వీడియోను వైరల్ చేశారు.

Posted by Kathy Ouma on Tuesday, 3 December 2019

అందులో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ డెలివరీ బాయ్… ఓ ఇంటికి ప్రోడక్ట్ డెలివరీ చెయ్యడానికి వెళ్లాడు. ఇంటి బయట వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్, స్నాక్స్, కుకీస్, క్రేకర్స్ ప్యాకెట్లు ఉండటం చూశాడు. అవి డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీగా ఉంచినవని తెలియడంతో తెగ ఆనందపడిపోయాడు. అవి అక్కడ పెట్టిన ఇంటి యజమానికి థాంక్స్ చెబుతూ… డాన్స్ చేస్తూ… తనకు కావాల్సినవి తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అమెరికాలోని డెలావేర్‌ రాష్ట్రంలోని విల్మింగ్టన్‌లో ఉన్న ఇంటి ముందు ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబందించిన వీడియోను ఇంటి ఓనర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.