అమెజాన్‌కు ఊహించని ట్విస్ట్..కూపన్‌ ఆఫర్‌తో భారీ నష్టం..! - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్‌కు ఊహించని ట్విస్ట్..కూపన్‌ ఆఫర్‌తో భారీ నష్టం..!

October 29, 2019

Amazon ...

అదిరిపోయే ఆఫర్లతో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. పంగలు, కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు తెస్తూనే ఉంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఆఫర్ వికటించింది భారీ నష్టాన్ని మూటగట్టుకునేలా చేసింది. చిన్నపాటి తప్పిదం కారణంగా నిండా మునిగిపోయింది. బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటనతో ఆ సంస్థ ఏకంగా కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది. 

యూకేలో చదువుకుంటున్న విద్యార్థులను ఆకర్షించేందుకు ఇటీవల అమెజాన్ ‘వెల్‌కమ్5’ కూపన్ ఆఫర్ తీసుకువచ్చింది.  దీని ద్వారా తొలిసారి కొనుగోళు చేసేవారికి రూ. 450 వరకు రాయితీ ప్రకటించింది. అయితే దీంట్లో జరిన చిన్న పొరపాటు వల్ల ఎన్నిసార్లు కొనుగోలు చేసినా ఈ ఆఫర్ పనిచేసింది. పొరపాటును గ్రహించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. చాలా వరకు రూ. 450 లోపు వస్తువులు ఆర్డర్ చేస్తూ ఉచిత కొనుగోళ్లతో అమెజాన్‌ను ఖాళీ చేశారు. రోజంతా బుకింగ్‌లతోనే గడిపేస్తూ పెద్ద ఎత్తున షాపింగ్ చేశారు. పదిరోజుల తర్వాత దీన్ని గుర్తించిన అమెజాన్ దాన్ని సవరణ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.