ఫోన్లపై 40%.. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫోన్లపై 40%.. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్

June 10, 2019

40 శాతం డిస్కౌంట్ ఆఫర్లతో ఈ-కామర్స్ ప్రముఖ సంస్థ అమెజాన్‌ ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ను ప్రారంభించింది. ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్, టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌లతో ఈ సేల్ కొనసాగనుంది. ఈ నెల 13 వరకు నాలుగు రోజులపాటు సాగే సేల్‌లో మొబైల్స్‌, యాక్సెసరీలపై 40 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.  

Amazon Fab Phones Fest Sale Best Offers OnePlus 6T, iPhone XR, Honor View 20 Discounts and Other Deals

యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్-64 జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.76,900 వుండగా రూ.58,999 లకే అందిస్తోంది. వన్‌ప్ల్‌స్ 6టి-8జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్‌ ధరను రూ.41,999 నుంచి రూ.27,999కే అందిస్తోంది. 8జీబీ ర్యామ్+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.45,999 నుంచి రూ.31,999కు అందిస్తోంది. పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ.10,150 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి పది శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.