అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్,టీవీలు - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్,టీవీలు

January 11, 2020

hgb

స్మార్ట్ ఫోన్,టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని అనుకుంటున్నారా. అయితే మీ కోసమే అమెజాన్ మరోసారి అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వస్తోంది. తన వినియోగదారులకు భారీ డిస్కౌంట్లతో గుడ్ న్యూస్ వినిపించింది. అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ మరోసారి తీసుకు రాబోతున్నారు. జనవరి 19 నుంచి 22 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండబోతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని ప్రవేశపెడుతున్నారు. 

స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్ ఇలా అన్ని కేటగిరీల్లో వస్తువులకు ఆఫర్లను ప్రకటించింది.ఎంపిక చేసిన వస్తువులపై 40 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఐఫోన్‌తో పాటు వన్‌ప్లస్ ఫోన్లపైనా డిస్కౌంట్ ఉంటుంది.వీటితో పాటు SBI క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉన్నట్టుగా పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో అతి తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులు మీ సొంతం చేసుకోవచ్చు. మరో విశేషం ఏంటంటే అమెజాన్ ప్రైం అకౌంట్ ఉన్నవారికి ఈ ఆఫర్ ఒక రోజు ముందు నుంచే అందుబాటులో ఉండనుంది. కాగా గతంలోనూ అమెజాన్ ఇటువంటి ఆఫర్లతో వచ్చి భారీగా సేల్స్ జరిపిన సంగతి తెలిసిందే.