Home > Featured > మొన్న ఫేస్‎బుక్..నేడు అమెజాన్..పోతున్న ఉద్యోగాలు

మొన్న ఫేస్‎బుక్..నేడు అమెజాన్..పోతున్న ఉద్యోగాలు

ఆర్థిక మాంద్యం సూచనలు, పెరుగుతున్న వడ్డీ రేట్లుకు టెక్ కంపెనీలు భయపడిపోతున్నాయి. ముందు జాగ్రత్తలు చేపట్టి.. కీలక నిర్ణయాలవైపు యాజమాన్యాల అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా తమ ఉద్యోగులను తగ్గించుకునేలో పనిలో పడ్డారు. ఇప్పటికే మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తే తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులకు తొలగింపు ప్రక్రియ ప్రారంభించేసారని తెలుస్తోంది. తాజాగా ఓ అమెజాన్ ఉద్యోగి ఇంకిడ్ ఇన్‌లో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. రోబోటిక్స్ టీమ్స్ మొత్తానికి పింక్ స్లిప్‌లు అందించారని మాజీ ఉద్యోగి పోస్ట్‌లో చెప్పాడు. అయితే ఎంతమందిని తొలగించారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. రాబోయే రోజుల్లో కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి మరిన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 11 Nov 2022 2:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top