స్మార్ట్ ఫోన్‌లపై 40% డిస్కౌంట్.. అమెజాన్ ప్రైమ్ డే సేల్.. - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్ ఫోన్‌లపై 40% డిస్కౌంట్.. అమెజాన్ ప్రైమ్ డే సేల్..

July 7, 2022

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ సంస్థ సంవత్సరంలో ఒకసారి ప్రకటించే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు ముహూర్తం ఫిక్సయింది. జులై 23 నుంచి జులై 24వ తేదీ వరకూ ఇండియాలో ప్రైమ్ కస్టమర్లకు ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సదరు ఈ-కామర్స్ సంస్థ వెల్లడించింది. జులై 23న అర్ధరాత్రి 12:00 గంటలకు మొదలవనున్న ఈ సేల్ జులై 24 రాత్రి 11:59కి ముగుస్తుంది. భారత్‌లో ఇది ఆరో ప్రైమ్ డే సేల్‌.

ప్రైమ్ డే సేల్‌, డిస్కౌంట్లు, ఆఫర్లు ఎలా ఉంటాయంటే..

అమెజాన్ ప్రైమ్ డే 2022 సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు అమెజాన్ పేర్కొంది. వన్‌ప్లస్‌, సామ్‌సంగ్‌, షావోమీ, రియల్‌మీ, ఒప్పో, ఐఫోన్లు, వివో, ఐకూతో పాటు అన్ని కంపెనీల మొబైల్స్‌పై ఆఫర్లు ఉండన్నాయి. అలాగే ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. డెల్, లెనోవో, హెచ్‌పీ, ఆసుస్ చాలా బ్రాండ్ల్ ల్యాప్‌టాప్‌లపై డిస్కౌంట్లు ఉంటాయి. ట్యాబ్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌ఫోన్స్, హెడ్‌సెట్స్, మొబైల్‌ యాక్ససరీలు, కంప్యూటర్ యాక్ససరీలపై కూడా 70 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్‌టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు లాంటి హోమ్ అప్లయన్సెస్‌పై 60 శాతం వరకు సేల్‌లో డిస్కౌంట్లు ఉండనున్నాయి. అలాగే కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ కూడా ఎక్కువగా ఉంటుంది.