amazon prime new plan
mictv telugu

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్

November 8, 2022

పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్.. తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే సరికొత్త ఏడాది ప్లాన్‌‌తో ముందుకొచ్చింది.
ఇప్పటివరకు ఏడాదికి చార్జీ రూ.1,499 చొప్పున ఉన్న సబ్‍స్క్రిప్షన్ ఇప్పుడు కేవలం రూ.599కే పొందవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌తో మొబైల్‌లో మాత్రమే సర్వీసును యాక్సెస్ చేయగలరు. స్మార్ట్ టీవీల్లో చూసే వారికి ఇది వర్తించదు.

ఈ కొత్త ప్లాన్‌లో హై రిజల్యూషన్ క్వాలిటీతో కంటెంట్‌ను పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు ఇప్పటికే ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. హై డెఫినిషన్ వీడియో కంటెంట్ కావాలంటే ముందు చెప్పుకున్నట్టు ఏడాదికి రూ.1,499 ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. రూ.599 ప్లాన్‌లో కంటెంట్‌ను ఆఫ్ లైన్‌లో కూడా చూసుకోవచ్చు. అమెజాన్ ఒరిజినల్స్‌లో లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను సైతం వీక్షించొచ్చు. ఇది ఒక్క మొబైల్ ఫోన్‌లోనే పనిచేస్తుంది. ఏడాది ప్లాన్ వద్దనుకునే వారి కోసం నెలకు రూ.89 నుంచి ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటి వరకు ఒక నెలకు అయితే రూ.179 పెడితేనే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లభించేది. మూడు నెలలకు రూ.459, ఏడాదికి చార్జీ రూ.1,499 చొప్పున ఉంది. కానీ, ఇప్పుడు కేవలం రూ.599 చెల్లించి ఏడాది ప్లాన్‌ను తీసుకోవచ్చు. కాకపోతే ఇది కేవలం మొబైల్ ఫోన్‌లో వినియోగానికి సంబంధించిన ప్లాన్ మాత్రమే.