Amazon Prime Video to stream ‘Rocketry’ on July 26
mictv telugu

మరో రెండ్రోజుల్లో ఓటీటీలోకి మాధవన్ ‘రాకెట్రీ’

July 24, 2022

దిగ్గజ శాస్త్రవేత్త నంబి నారాయ‌ణ‌న్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌’ . నంబి నారాయ‌ణ‌న్ పాత్రలో హీరో మాధవన్‌ నటించి.. ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. జులై 1న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నంబి నారాయ‌ణ‌న్ భార్య పాత్రలో సీనియర్ నటి సిమ్రాన్ న‌టించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. తమిళ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో క‌నిపించారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌‌లో ఈ నెల 26 నుంచి రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లు అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్ల వద్ద కాసులు బాగానే రాబట్టుకుంది. రూ.40 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.