అమెజాన్ ఒక్కరోజు సంపాదన రూ. 14.26 లక్షల కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ ఒక్కరోజు సంపాదన రూ. 14.26 లక్షల కోట్లు

February 5, 2022

mmm

కోట్లాది మంది కోడి కూయక ముందు నుంచి మొదలుకొని నిద్రపోయే వరకు కావలసిన వస్తువులు అన్నీ ఆన్‌లైన్ ద్వారా ఇళ్లకే తెప్పించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నలుమూలాలా ఆన్‌లైన్ వ్యాపారంతో ఒక ఊపు ఊపుతున్న అమెజాన్ కంపెనీ కళ్లు తిరిగే రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజులోనే 19,100 కోట్ల డాలర్లు సంపాదించింది. మన కరెన్సీలో సుమారు రూ. 14.26 లక్షల కోట్లు.

మరో దిగ్గజ కంపెనీ యాపిల్ గతవారం సాధించిన రూ. 13.51 లక్షల కోట్ల(18,100 కోట్ల డాలర్ల) షేర్ విలువను అమెజాన్ బద్దలు కొట్టింది. అమెరికాలో ఫ్రైమ్ సభ్యత్వ ధరల పెంపు, త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా ఉండడం వల్లనే అమెజాన్ షేర్ విలువ పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజే ఫేస్ బుక్ రూ. 18 లక్షల కోట్లు నష్టపోయి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. మదుపరులు ఆకర్షణీయమైన సేవలను ఎక్కువగా ఉపయోగించకపోవడమే దీనికా కారణం కావొచ్చని ఫేస్‌బుక్ మాతృ సంస్థ ‘మెటా’ వెల్లడించింది. మొత్తంగా చూస్తే ఇటీవలి కాలంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్ ఐఎన్ సీ షేర్లు మాత్రం బాగా లాభాలు పొందుతున్నాయి అని చెప్పుకోవచ్చు.