Amazon Set to Lay Off Thousands of Corporate Workers
mictv telugu

అమెజాన్‌లో 10 వేల ఉద్యోగాలు కోత !

November 15, 2022

ఆర్థిక మాంద్యం భయంతో భారీగా టెక్ ఉద్యోగాలు పోతున్నాయి. ఖర్చులను తగ్గించే క్రమంలో కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉద్యోగులపై వేటు వేయగా.. తాజాగా ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. ఇటీవల కాలంలో అమెజాన్ కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఆర్థికమాంద్యం భయంతో నష్టాలను పూరించే విధంగా చర్యలు చేపడుతోంది యాజమాన్యం.

న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం పలు విభాగాలలోని సుమారు 10 వేల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొందరికే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిందంట. అయితే కంపెనీలోని పెద్దగా లాభదాయకం కాని విభాగాల్లో పనిచేస్తున్నవారు కంపెనీలోనే ఇతర విభాగాలలో అవకాశాలు వెతుక్కోవాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే ఉద్యోగుల నియామకాలనూ కొంతకాలంగా ఆమెజాన్ ఆపేసింది. దాదాపు 16 లక్షల మంది ఏటా అమెజాన్‌లో చేరుతుంటారు. అయితే ఈ మధ్య నష్టాలు నేపథ్యంలో పొదుపు చేయడంపై దృష్టిసారించింది.