అమెజాన్.. తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సమ్మర్ సేల్ లో భాగంగా మార్చి 19 వరకు వినియోగదారులకు సరసమైన ధరలకు 5జీ ఫోన్లను అందించనుంది. రూ. 15 వేల లోపు, 15 వేలకు మించి కూడా మంచి మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూడండి
ఐక్యూ జెడ్ 6 లైట్ 5జి:
ఈ 5జి స్మార్ట్ ఫోన్ 120 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జనరేషన్ 1 ప్రాసెసర్ తో తయారైంది. ఇందులో 5000 ఎంఏహెచ్ ఇన్ బిల్ట్ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. ఆయా (HDFC, ICICI)బ్యాంక్ ఆఫర్ల తగ్గింపుతో ఈ ఫోన్‌ను రూ.12,744లకే సొంతం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఫోన్ ధర రూ.13ల లోపే ఉంటుంది. ఛార్జర్ మాత్రం సపరేట్‌గా కొనుక్కోవాల్సిందే.
శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 33 5జీ:
శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ స్మార్ట్‌ఫోన్ కూడా అమెజాన్‌లో మంచి ఆఫర్‌లో లభిస్తుంది. రూ.24,999 వేల విలువైన ఫోన్.. ఎంఆర్‌పీ ధర రూ.15,999 మాత్రమే ఉండగా.. డిస్కౌంట్‌తో కలుపుకొని రూ.14,499 లకే లభిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఎక్సినోస్ 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + వన్‌యూఐ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి కూడా ఛార్జర్ వేరుగా కొనాలి.
రూ.15,000 వేల పైన ఫోన్లు
రియల్‌మి నార్జో 50 ప్రో:
పదిహేను వేల పైన అందుబాటులో ఉన్న 5జి స్మార్ట్ ఫోన్ రియల్‌మి నార్జో 50 ప్రో.. ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.16,730 లకే సొంతం చేసుకోవచ్చు. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే గల ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 90 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
షావొమి 13 ప్రో 5జీ
ఇక ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌ని ఇష్టపడే వారికి షావొమి 13 ప్రో కూడా చాలా మంచి 5జీ ఫోన్. 4,820mAh బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేసే షావొమి 13 ప్రో ఫోన్ స్మార్ట్‌ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.73 అంగుళాల స్క్రీన్‌ని అమర్చారు. ఈ ఫోన్ ధర 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999 గా ఉండగా.. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో ఫోన్ కొనుగోలు చేసే వారికి తక్షణమే రూ. 10,750 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. డిస్కౌంట్ అనంతరం ఫోన్ ధర రూ. 69,249 కి దిగొచ్చింది. మరో బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ రూ. 8,000 డిస్కౌంట్ అందిస్తోంది.
ఐక్యూ 9 SE ఫీచర్లు
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో..తమ సబ్ బ్రాండ్ ఐక్యూ(iQoo) నుంచి విడుదలైన ఐక్యూ 9 SE కూడా అమెజాన్‌లో మంచి ధరకే లభిస్తోంది. రూ.30, 990 వేల విలువైన ఈ ఫోన్ రూ.27, 765 కే డిస్కౌంట్ లో వస్తుంది. ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.62 అంగుళాల FHD + డిస్ప్లే ఉంది. స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ తో పనిచేస్తుంది. వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 48 MP ప్రైమరీ కెమెరా, 13 MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా స్నాపర్ మరియు 2 MP మోనోక్రోమ్ కెమెరాతో పాటు ముందు భాగాన 16MP సెల్ఫీ కెమెరా ఉంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ ఐక్యూ 9 SE 66W ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది.
వన్ ప్లస్ 11 ఆర్:
అమెజాన్ ఫిప్త్ గేర్ స్టోర్‌లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉన్న మరో 5జి స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 11 ఆర్.. దీని స్పెసికేషన్లు.. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా, 120 హెచ్ జడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, అమోఎల్ ఈడీ డిస్‌ప్లే, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఫోన్ ప్రారంభ ధర రూ.39,999. ఈ ఫోన్ కి మాత్రం ఎలాంటి ఆఫర్ లేదు.