టిక్‌టాక్‌పై అమెజాన్ నిషేధం..కొన్ని గంటలకే.. - MicTv.in - Telugu News
mictv telugu

టిక్‌టాక్‌పై అమెజాన్ నిషేధం..కొన్ని గంటలకే..

July 11, 2020

 

bcfb

ఇప్పటికే చైనీయ టిక్ టాక్ యాప్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెల్సిందే. ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు కూడా టిక్ టాక్ పై బ్యాన్ విధించాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అమెజాన్ కంపనీ మొబైల్ ఫోన్లలో చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను వాడొద్దంటూ తన ఉద్యోగులకు సూచించింది. తాము పంపే ఈ-మెయిల్స్‌లోని సమాచారం టిక్‌టాక్‌ ద్వారా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా మొబైల్ ఫోన్ల నుంచి ప్రతి అమెజాన్ ఉద్యోగి ఆ యాప్‌ను తొలగించాలని ఇటీవల ఈ-మెయిల్స్ ద్వారా పేర్కొంది. 

ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా మరో ప్రకటనలో పేర్కొంది. టిక్‌టాక్ పై నిషేధం ప్రకటన పొరపాటున చేశామని అమెజాన్ తెలిపింది. తమ ఉద్యోగుల్లో కొందరికి ఈ-మెయిల్స్ తప్పుగా పంపించామని, ఆ యాప్‌కు సంబంధించి ప్రస్తుతం తమ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. టిక్‌టాక్‌పై విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకోవడానికి కారణాన్ని మాత్రం అమెజాన్ తెలపలేదు.