ఉద్యోగులపై అమెజాన్ ఔదార్యం.. రూ.3 వేల కోట్ల బోనస్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులపై అమెజాన్ ఔదార్యం.. రూ.3 వేల కోట్ల బోనస్‌

June 30, 2020

Frontline employees.

కరోనా వైరస్‌ సంక్షోభంలోనూ పనిచేస్తున్న ముందు వరుస ఉద్యోగులకు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ శుభవార్త చెప్పింది. ముందు వరుస ఉద్యోగులకు ఏకకాల బోనస్‌లు అందజేస్తామని ప్రకటించింది. ఇందుకోసం 500 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3,775 కోట్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. జూన్‌ వరకు పనిచేసిన ఉద్యోగులు, భాగస్వాములు ఏకకాల బోనస్‌గా ఒక్కొక్కరికి 150 డాలర్లు (రూ.11,300) నుంచి 3000 డాలర్లు (రూ.2.26 లక్షలు) అందజేస్తామని అమెజాన్‌ వెల్లడించింది. అమెజాన్ ప్రకటనతో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కరోనా కష్టకాలంలో అండగా నిలుస్తున్న అమెజాన్ సంస్థ నిర్ణయంపై సదరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఏటా 10 బిలియన్‌ వస్తువులను వినియోగదారుల వద్దకు చేరుస్తుంది. కరోనా సంక్షోభంలో అమెజాన్‌కు ఇబ్బందులు వచ్చిపడ్డాయి. అయితే కొన్ని రోజుల్లోనే పరిస్థితి చక్కబడింది. మహమ్మారి సమయంలో ఎక్కువమంది తమ అవసరాల కోసం ఈ కామర్స్‌ సంస్థలపై ఆధారపడుతున్నారు. దీంతో ఆన్‌లైన్ షాపింగ్ పెరిగింది. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం ఆ సంస్థపై నిఘా పెట్టింది. తన ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకుంటుందా, భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగం, ఆరోగ్య తనిఖీలు చేపడుతోందా లేదా అని పసిగట్టింది.