కరోనా డెడ్‌బాడీ కోసం గిరిజనుల ఆక్రోషం.. ఆరుగురిని కిడ్నాప్ చేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా డెడ్‌బాడీ కోసం గిరిజనుల ఆక్రోషం.. ఆరుగురిని కిడ్నాప్ చేసి..

July 5, 2020

Tribe

కరోనాతో చనిపోయిన తమ నాయకుడి మృతదేహాన్ని తమకే అప్పగించాలని అమెజాన్‌ తెగకు చెందిన గిరిజనులు ఆరుగురిని కిడ్నాప్‌ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులతో పాటు ఇద్దరు సైనికులు, సాధారణ పౌరులను పెరువియన్ సరిహద్దుకు సమీపంలోని కుమయ్ గ్రామ గిరిజన ప్రజలు గురువారం బంధించారు. దీంతో ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఆగ్రహంతో ఉన్న గిరిజనులు వారిని ఏమైనా చేస్తారని భావించారు. ఈ క్రమంలో గిరిజనులకు, ప్రభుత్వానికి చర్చలు జరిగాయి. చర్చల అనంతరం బంధించిన వారిని గిరిజనులు ఆదివారం విడుదల చేశారని ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆగ్నేయ ఈక్వెడార్‌లోని అమెజాన్‌ అడవిలో ఉన్న పాస్తాజా ప్రావిన్స్‌లో గిరిజనుల బంధీ నుంచి విడుదలైన పౌరులకు వైద్య పరీక్షలు నిర్వహించాం’ అని ఈక్వెడార్‌ అంతర్గత మంత్రి పౌలా రోమో ట్వీట్ చేశారు. 

కిడ్నాప్ చేసిన బృందంలో సమారు 600 మంది గిరిజనుల ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బందీలైన పౌరులను విడిపించేందుకు పోలీసు కమాండర్ జనరల్ ప్యాట్రిసియో కారిల్లో చర్చలు జరిపారని వివరించారు. బంధించిన వారిని వదిలిపెట్టిన అనంతరం గిరిజన నేత మృతదేహాన్ని కుమయ్ గ్రామానికి తరలించినట్లు తెలిపారు. కాగా, గిరిజన నేతకు కారోనా సోకి మృతిచెందాడు. దీంతో ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు సదరు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే గిరిజనులు అందుకు అస్సలు ఒప్పుకోలేదు. తమ నేత పార్థివదేహం ​కోసం ఆరుగురు పౌరులను  కిడ్నాప్‌ చేశారు. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది.