రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి మనవడు పుట్టిన విషయం తెలిసిందే. తనకు మనవడు పుట్టాడని అంబానీ సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు. అయితే ప్రస్తుతం అంబానీ మనవడు పృథ్వీ అంబానీ కేవలం 15 నెలల వయసులోనే బడికి వెళ్తుండటం సంచలనంగా మారింది. 2020 డిసెంబరు 10న జన్మించిన ప్రధ్వీని.. దేశీయంగానే చదివించాలని ముకేశ్ అంబానీ కుటుంబం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏ స్కూలుకు పంపాలనే విషయంపై కుటుంబమంతా చర్చలు మీద చర్చలు చేశారు. అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారు. పృథ్వీ తల్లిదండ్రులు ఆకాశ్, శ్లోకా చదువుకున్న మలబార్ హిలోని ‘సప్లవర్ స్కూల్’ కే పంపాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా నాణ్యమైన విద్యతోపాటు చిన్నారి భద్రతకూ ప్రాధాన్యమివ్వాలని భావించారు.
ఈ నేపథ్యంలో మంగళవారం పృథ్వీ అంబానీ ఆయన తల్లిదండ్రులు స్వయంగా పాఠశాలకు తీసుకువచ్చారు. దీంతో ఆ స్కూల్ టీచర్లు తరగతి గదిలో పృథ్వీని మిగతా పిల్లలందరికీ పరిచయం చేశారు.అంతేకాకుండా పృథ్వీ జీవితంలో ‘విద్య’ అనే పుస్తకం పేజీలు తెరచుకున్నాయని తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ సందర్భంగా పృథ్వీ అంబానీ తల్లిదండ్రులు అతనిని ఒక ‘సాధారణ’ జీవితానికి అలవాటు పడేలా చేయాలని టీచర్లను కోరినట్లు సమచారం.