Ambati Rambabu made satirical comments on Pawan Kalyan
mictv telugu

పవన్ నాలుగో పెళ్లి అయ్యేలోపు ఆ పని పూర్తి చేస్తా

October 21, 2022

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు కురిపించారు. ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు అంటూ విమర్శించగా, ఇప్పుడు కొత్తగా నాలుగో పెళ్లి అంటూ చురకలు అంటించారు. అంతకుముందు జనసేన అంబటిని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది. అందులో ‘పోలవరం ఎంతవరకు వచ్చింది. ఎప్పుడు పూర్తవుతుందో ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలవా అంబటి? అని ప్రశ్నించింది. దీనికి అంబటి కూడా ధీటుగా కౌంటరిచ్చారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునే లోపు ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తనదని పేర్కొన్నారు. ఇప్పుడు దీనికి జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా, ఇటీవల వైసీపీపై హాట్ కామెంట్లు చేసిన పవన్ కల్యాణ్ తన మూడు పెళ్లిళ్లపై కూడా క్లారిటీ ఇచ్చారు. విడాకులు ఇచ్చిన తర్వాతనే మరో పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. దీనికి సీఎం జగన్ సహా మంత్రులు, పార్టీ నాయకులు ధీటుగా స్పందించారు.