స్పీకర్ కుర్చీలోకి అంబటి రాంబాబు - MicTv.in - Telugu News
mictv telugu

స్పీకర్ కుర్చీలోకి అంబటి రాంబాబు

December 13, 2019

Ambati Rambabu01

ఏపీ అసెంబ్లీలో అధికార, విపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలతో రణరంగాన్ని తలపించాయి. ఇరువైపులా సభ్యులు ఢీ అంటే ఢీ అన్నట్టుగా వాదనలు చేసుకుంటూ కనిపించారు. తాజాగా శుక్రవారం సభలో మరో విశేషం జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. ఆయనే సభను నడిపిస్తూ కనిపించారు. సభలో హోంమంత్రి సుచరిత మహిాళా రక్షణ కోసం దిశ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆయనే సభను నడిపించడం విశేషం. 

మధ్యాహ్నం సమయంలో అసెంబ్లీకి దిశ బిల్లు వచ్చింది.  అప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో పని మీద బయటకు వెళ్లాల్సి ఉంది. డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి కూడా సభలో అందుబాటులో లేరు. దీంతో స్పీకర్ తన స్థానంలో అంబటిని తాత్కాలికంగా నియమించారు. సభను నడిపే బాధ్యత రాంబాబుకు ఇవ్వడంతో ఆయన ఆ స్థానంలో ప్రత్యక్షం అయ్యారు. కాగా స్పీకర్ తన విచక్షణ అధికారాల ప్రకారం తాను అందుబాటులో లేనప్పుడు సభలోని ఏదేని ఒక సభ్యుడికి సభను నడిపించే బాధ్యతను అప్పగించ వచ్చు. గత అసెంబ్లీ సెషన్స్‌లో కూడా అంబటి స్పీకర్‌గా సభను నడిపించిన సంగతి తెలిసిందే.