చెన్నైని ఆదుకున్న అంబటి రాయుడు - MicTv.in - Telugu News
mictv telugu

చెన్నైని ఆదుకున్న అంబటి రాయుడు

September 20, 2020

ncgn

ఐపీఎల్ టీ20 క్రికెట్‌ లీగ్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంబటి రాయుడు(71), డుప్లెసిస్‌(58) అర్ధ శతకాలతో చెన్నై జట్టుని విజయ తీరాలకి చేర్చారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేజింగ్‌కి దిగిన చెన్నై జట్టుకు ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 

ఆరు పరుగులకే షేన్‌ వాట్సన్‌(4), మురళీ విజయ్‌(1) ఔటయ్యారు. ఈ సమయంలోనే క్రీజులోకి వచ్చిన రాయుడు, డుప్లెసిస్‌ నిలకడగా ఆడి జట్టు స్కోరును ముందుకు నడిపించారు. ముంబయి బౌలర్లలో ట్రెంట్‌బౌల్ట్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్య, పాటిన్‌సన్‌, రాహుల్‌ చాహర్‌ తలా ఓ వికెట్‌ తీశారు. ముంబయి జట్టులో సౌరభ్‌ తివారి(42), క్వింటన్‌ డికాక్‌(33) పరుగులు చేశారు. తొలి వికెట్‌కు డికాక్‌తో కలిసి రోహిత్‌(12) 46 పరుగులు జోడించాడు. చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా జడేజా, దీపక్‌ చాహర్‌ రెండేసి వికెట్లు తీశారు. సామ్‌కరన్‌, పీయుష్‌ చావ్లా చెరో వికెట్‌ తీశారు.