అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కవచాలు - MicTv.in - Telugu News
mictv telugu

అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కవచాలు

April 5, 2018

దేశవ్యాప్తంగా విగ్రహ విధ్వంసాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్రిపురలో లెనిన్, తమిళనాడులో పెరియార్, దాదాపు అన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలు నేలకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ రాజధాని లక్నోలోని బాబాసాహేబ్ భీంరావ్ అంబేడ్కర్ యూనివర్సిటీ(బీబీఏయూ)లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. యూపీలో పలుచోట్ల దళితుల ఆరాధ్యనేత విగ్రహాలను ధ్వంసం చేస్తుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. విగ్రహాల చుట్టూ ఐరన్ గ్రిల్స్ పెట్టారు.అయితే వర్సిటీ యాజమాన్యం మాత్రం మరోలా చెబుతోంది. విగ్రహాల విధ్వంసానికి  గ్రిల్స్‌కు ఏమాత్రం సంబంధం లేదని అంటోంది. కానీ కొందరు అధికారులు మాత్రం అసలు విషయం తెలిపారు. అంబేడ్కర్ బొమ్మలకు రక్షణ కోసమే గ్రిల్స్ పెట్టామని తెలిపారు. ఈ వర్సిటీలో 50 శాతం మంది ఎస్సీ, బీసీ ఇతర అణగారిన వర్గాల విద్యార్థులే ఉన్నారు.