అంబులెన్స్‌ సిబ్బంది ఇష్ట రాజ్యం.. బైక్‌పైనే మృతదేహం తరలింపు - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్స్‌ సిబ్బంది ఇష్ట రాజ్యం.. బైక్‌పైనే మృతదేహం తరలింపు

May 5, 2022

ఆంధ్రప్రదేశ్‌లో అంబులెన్స్‌ల డ్రైవర్లు, సిబ్బంది పేద ప్రజల పట్ల ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శవాలపైనే దందాలు చేస్తున్నారు. ఇటీవలే రూయా ఆసుపత్రిలో జరిగిన సంఘటన మరవకముందే మరో సంఘటన నెల్లూరు జిల్లా సంగంలో చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన శ్రీరామ్ (8), ఈశ్వర్ (10) అనే ఇద్దరు బాలలు కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తూ, బుధవారం మునిగి మృతి చెందారు.

గమనించిన స్థానికులు కాలువలోకి దూకి, మృతదేహాలను బయటికి తీశారు. అప్పటికే ఈశ్వర్ మృతిచెందగా, శ్రీరామ్‌ కోన ఊపిరితో ఉన్నాడు. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ, మార్గమాధ్యలోనే ఆ బాలుడు మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు.

కొంతసేపటికి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని, 108 వాహన సిబ్బందిని కోరారు. దాంతో అంబులెన్స్ డ్రైవర్లు, సిబ్బంది రూల్స్ ఒప్పుకోవంటూ, అంబులెన్స్ రాదని తేల్చి చెప్పారు. అనంతరం ప్రైవేట్ ఆటోలు, ఇతర వాహనాల డ్రైవర్లను ఎంత బతిమాలినా, ఎవరూ ముందుకు రాలేదు. చేసేది ఏమిలేక ఆ తండ్రి ద్విచక్ర వాహనంపైనే శ్రీరామ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు.

ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఓ తండ్రి తన కొడుకు మృతిదేహాన్ని తరలించడానికి అంబులెన్సు కావాలని డ్రైవర్లను సంప్రదిస్తే, 90 కిలోమీటర్లకు రూ.10 వేలు అడిగి దౌర్జన్యం చేసిన విషయం తెలిసిందే. దాంతో చేసేది ఏమిలేక ఆ తండ్రి తన కొడుకు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లాడు.