Ambulance doors that did not open, a person died.. Here is the video
mictv telugu

ప్రాణం తీసిన అంబులెన్స్..వీడియో ఇదిగో

August 30, 2022

Ambulance doors that did not open, a person died.. Here is the video

కేరళ రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని సరైన సమయంలో ఆసుపత్రికి తరలించినప్పటికి..అంబులెన్స్ డోర్లు తెరుచుకోక ఆ వ్యక్తి ప్రాణాలు వదిలిన ఘటన కేరలో సంచలనంగా మారింది. డ్రైవర్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన ఆ అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దాంతో అక్కడున్న వైద్య సిబ్బంది డోర్లను పగలగోట్టి గాయపడిన వ్యక్తిని ఆఫరేషన్ థియేటర్ రూంకి తీసుకెళ్లి, పరీక్షించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.

వివరాల్లోకి వెళ్తే..కోజికోడ్‌లో స్కూటర్ నడుపుతూ, కోయమన్ అనే 66 ఏళ్ల వ్యక్తి కిందపడిపోయాడు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా కొద్ది సమయంలోనే అక్కడికి చేరుకుంది. దాంతో గాయపడిన కోయమన్ అంబులెన్స్ సిబ్బంది..ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. వేగంగా ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ..అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దాంతో అంబులెన్స్ సిబ్బంది, బాధితుడి బంధువులు అరగంటకు పైగా సుత్తితో కొట్టినా అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. మళ్లీ మళ్లీ కొట్టగా డోర్లు తెరుచుకున్నాయి. కానీ, అప్పటికే క్షతగాత్రుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు.