అంబులెన్స్ నడిపిన రోజా.. వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

అంబులెన్స్ నడిపిన రోజా.. వీడియో

July 7, 2020

RK Roja.

చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంబులెన్స్ వాహనం నడిపారు. నగరి నియోజక వర్గానికి ప్రభుత్వం కేటాయించిన ఐదు 104, ఐదు 108 అంబులెన్స్‌ సర్వీసులను రోజా అట్టహాసంగా ప్రారంభించారు. న‌గ‌రి  పుత్తూరు పున్నమి సర్కిల్‌లో వైఎస్సార్ విగ్ర‌హం వ‌ద్ద ఈ కార్యక్రమం జరిగింది. సర్వీసులను ప్రారంభించిన అనంతరం రోజా 108 వాహనాన్ని స్వయంగా నడిపి అందరిని ఆశ్చర్యపరిచారు. 

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్సార్‌సీపీ కార్య‌కర్త‌లు, అభిమానులు పెద్ద సంఖ్య‌లో హాజరయ్యారు. కాగా,  రాష్ట్రంలో అత్య‌వ‌స‌ర సేవ‌లందించే 108,104 వాహ‌నాల‌ను అత్యాధునిక సౌక‌ర్యాల‌తో జూలై 1న 1008 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఒకేసారి ప్రారంభించిన విషయం తెలి‌సిందే. వీటిని 13 జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేశారు.  అక్కడి మెడికల్ అవసరాలకు తగిన విధంగా అంబులెన్స్‌లను ఆయా జిల్లాలకు కేటాయించారు.