రోగిని రోడ్డుపై వదిలేసిన అంబులెన్స్ సిబ్బంది
క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగి పట్ల అంబులెన్స్ సిబ్బంది అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లే సమయంలో అతన్ని మధ్యలోనే రోడ్డుపై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. నిస్సహాయుడైన వృద్ధుడిని ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ వృద్ధుడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా అనుమానంతో అతన్ని గౌతమ్ బుద్ద్ నగర్ ఆస్పతిలో పరీక్షలు నిర్వహించారు. దీంట్లో అతనికి టీబీ మాత్రమే ఉందని తేలింది. దీంతో అతనికి చికిత్స అందించి అంబులెన్సులో ఇంటి దగ్గర చేర్చాలని అధికారులు సూచించారు. కానీ అంబులెన్స్ సిబ్బంది మాత్రం మధ్యలోనే వదలేసి వెళ్లిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన రోడ్డుపై ఒంటరిగా పడి ఉండటం స్థానికులు గమనించారు. విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు దీనిపై సీరియస్ అయ్యారు. సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.