గుంటూరులో కరోనా పేషంట్ల అంబులెన్స్ బోల్తా - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో కరోనా పేషంట్ల అంబులెన్స్ బోల్తా

May 16, 2020

Guntur

ఏపీలో కరోనా పేషెంట్లతో వెళ్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయిన అంబులెన్స్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కరోనా పేషెంట్లకు గాయాలయ్యాయి. గుంటూరు జిల్లాలోని పెదకాకాని ఆటో నగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు పేషెంట్లతో 108 అంబులెన్స్ బయలుదేరింది. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి మంగళగిరి ఎన్‌ఆర్ఐ ఆసుపత్రికి కరోనా పేషెంట్లను తరలిస్తోంది. 

ఈ క్రమంలో  జై లక్ష్మీ హోండా షోరూం సమీపంలో అడ్డువచ్చిన లారీని తప్పించబోయి దాన్ని ఢీకొట్టి అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు కరోనా పేషెంట్లలో ఒకరికి చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెద్దకాకాని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో 108 అంబులెన్స్‌లో కరోనా పేషెంట్లు ఇద్దరినీ ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు.